కలియుగ దైవంను దర్శించుకున్న ప్రముఖులు - new year celebrations

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2024, 2:07 PM IST

VIPs Visiting Tirumala : నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పలువురు ప్రముఖులు కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో విశాఖ శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, సినీ నటుడు సుమన్​లు వైకుంఠ ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్నారు. వీరితో పాటు తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శనం చేసుకుని తరించారు.

Celebrities Who Wished Telugu People : తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నేత కిషన్​ రెడ్డి తిరుమల శ్రీనివాసుడిని దర్శనం చేసుకుని తరించారు. 2024 సంవత్సరం కీలకం కానున్నదని పేర్కొన్నారు. నూతన సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలు, దీర్ఘాయుఘతో జీవించాలని ప్రార్థించారు. టీటీడీ అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.