Vinayaka Chavithi Celebrations in AP : ఘనంగా వినాయక చవితి వేడుకలు.. కరెన్సీ, చెరకు గడలతో గణపతి ప్రతిమలు - కర్నూల్ జిల్లా తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2023, 6:04 PM IST

Vinayaka Chavithi Celebrations in AP : రాష్ట్రవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో గణపతి ప్రతిమలను ప్రత్యేకంగా అలకరించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యeలయంలో వినాయక చవితి పూజలు నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి గణనాథుడికి హారతులు ఇచ్చి.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Eco Friendly Ganesh Idol : నంద్యాలలో భగవత్ సేవా సమాజ్ సభ్యులు ప్రత్యేకంగా చెరుకు గడలు, తామర గింజలతో విఘ్నేశ్వర ప్రతిమను ఏర్పాటు చేశారు. బాలాజీ కాంప్లెక్స్‌లో గరుడ వాహన మహా గణపతి రూపంలో, ఐదు రకాల సముద్ర గవ్వలతో స్వామివారు దర్శనమిచ్చారు. కర్నూలులో 56 అడుగుల ఎత్తైన మట్టి వినాయకుడి విగ్రహం  విశేషంగా అకట్టుకుంటోంది. మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమల వల్ల పర్యావరణాన్ని కాపాడినట్లు అవుతుందని నిర్వాహకులు తెలిపారు.

Ganesh idol Decorated with Currency Notes : విజయవాడలో చాలా చోట్ల భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. రాఘవయ్య పార్కు వద్ద కాగితంతో, ఇస్లాం పేటలో కరెన్సీ నోట్లతో ఉన్న గణపతి ప్రతిమలను అలకరించారు. గుంటూరులో వాడవాడలా విభిన్న రకాల ఆకర్షణీయ మండపాలను.. ఏకదంతుడి కోసం సిద్ధం చేశారు. ఎక్కడికక్కడ అరుదైన ఆకృతుల్లో రూపొందించిన వినాయక విగ్రహాలకు నగరవాసులు విశేష పూజలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని పురవిధుల్లో వినాయకుడి ప్రతిమను పల్లకిలో ఉంచి ఊరేగించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.