సమచారం లేకుండా రాత్రికి రాత్రే పరిశ్రమ వ్యర్థాల పైప్​లైన్ పనులు - ప్రతిఘటించిన గ్రామస్థులు - anakapalli villagersprotest about pipeline

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 2:23 PM IST

Villagers Protest Against Construction of Pipe Lines: పరిశ్రమ వ్యర్థాలు సముద్రంలో తరలించేందుకు అనకాపల్లి జిల్లాలో పైప్​లైను పనులు కోసం అధికారులు రోడ్డు వేయడంతో  గ్రామస్థులు ఆగ్రహించారు.  పైప్​లైను పనులు చేపడుతున్న ప్రదేశానికి భారీ సంఖ్యలో మత్స్యకారులు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పనులను తక్షణమే నిలిపివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Bulk Drug Industries Setup in Tuni and Thondangi Mandals of Kakinada District: కాకినాడ జిల్లా తుని,తొండంగి మండలాల్లో బల్క్ డ్రగ్స్ పరిశ్రమల(Bulk Drug Industries) ఏర్పాటు అవుతున్నాయి. ఈ పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్ధాలను సముద్రంలోకి తరలించేందుకు అనకాపల్లి జిల్లాలోని సముద్రతీరం దగ్గర అధికారులు రోడ్డు  పనుల చేపట్టారు. అధికారులు నిర్వహించిన పనులపై అనంతపురం జిల్లా గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఈ పనులపై ఆర్డీవోకి కంప్లెయింట్ చేశామని వెంకటనగరం సర్పంచ్  వంకా రమణ తెలిపారు. గ్రామస్థులకు తెలియకుండా రాత్రికి రాత్రే పనులు నిర్వహించారని, ప్రాణాలు పణంగా పెట్టి అయినా పైప్​లైన్​ను అడ్డుకుంటామని రమణ స్పష్టం చేశారు. పక్క జిల్లాలో ఏర్పాటు అవుతున్న పరిశ్రమలకు తమ ప్రాంతంలో పైపులైన్ ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు.పరిశ్రమలు ఉన్న ప్రాంతంలోనే వ్యర్ధాలను కలపాలని గ్రామస్థులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని వెంకటనగరం, రాజానగరానికి చెందిన మత్స్యకారులు...  పైపులైను పనులు చేపడుతున్న ప్రదేశానికి భారీ సంఖ్యలో  చేరుకొన్న మత్స్యకారులు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమల కారణంగా మత్స్య సంపద నాశనం అవుతుందని వాపోయారు. పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.