యానంలో రిక్రియేషన్ క్లబ్‌ను వ్యతిరేకిస్తూ గ్రామస్థులు నిరసన
🎬 Watch Now: Feature Video
Villagers protest against club in Yanam: కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానంలోని మెట్టకూరు గ్రామంలో జనావాసాల మధ్య విక్టరీ యానం పేరుతో రిక్రియేషన్ క్లబ్‌ను వెంటనే మూసివేయాలని స్థానిక గ్రామాల ప్రజలు క్లబ్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామం మద్యలో రిక్రియేషన్ క్లబ్ పేరుతో పేకాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. దీనివల్ల బయట నుంచి వచ్చే వాహనాల రాకపోకలు కారణంగా అనేక ఇబ్బందులు గురవుతున్నామని స్థానికులు పేర్కొన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా... మద్రాస్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితులు లేకుండా పోయాయని పేర్కొన్నారు. గ్రామాల మధ్య క్లబ్బులకు అనుమతి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని మహిళలు ప్రశ్నించారు.
క్లబ్‌ను తొలగించుకుంటే సుమారు 8 గ్రామాల ప్రజలతో మహా ధర్నా నిర్వహిస్తామని అధికారులను హెచ్చరించారు. రిక్రియేషన్ క్లబ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలను అధికారులు అడ్డుకున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలు నుంచి వచ్చేవారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా 24 గంటలు పాటు రక్షణ కల్పించాలని స్థానిక పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో క్లబ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు క్లబ్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.