Village Volunteers Working as YSRCP Activists: ప్రజాధనంతో వేతనం తీసుకుంటూ.. వైసీపీ సేవలో నిమగ్నమైన గ్రామ వాలంటీర్లు - Volunteers Buy Sakshi Daily NewsPaper

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 8:36 AM IST

Village Volunteers Working as YSRCP Activists : ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన వాలంటీర్లు.. వైఎస్సార్సీపీ సేవలో తరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటూ.. అధికార పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు పథకాల చేరవేత కంటే వైసీపీ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లకు గౌరవ వేతనంగా రాష్ట్ర ప్రభుత్వం.. ఏటా 1,566 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. నాలుగున్నరేళ్లలో 6వేల264 కోట్ల రూపాయలు చెల్లించింది. ఏటా పురస్కారాలు, సత్కారాల ఖర్చులు, సెల్‌ఫోన్‌ బిల్లులు, సాక్షి పత్రిక కొనుగోళ్ల కింద (Volunteers Buy Sakshi Daily NewsPaper) చెల్లించే రూ.825 కోట్లు కూడా కలిపితే వీరిపై వెచ్చిస్తున్న మొత్తం 7,089 కోట్ల రూపాయలు. ఇక, వాలంటీర్లకు శిక్షణ పేరుతో ముఖ్యమంత్రి జగన్ తన సొంత పార్టీ రాజకీయ వ్యవహారాలు నడిపించేందుకు ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి నాలుగేళ్లలో కట్టబెట్టిన సొమ్ము 270 కోట్ల రూపాయలు. ఇది కూడా కలిపితే అయ్యే మొత్తం 7వేల 359 కోట్ల రూపాయలు. 

ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తూ వాలంటీర్లతో జగన్ ప్రజలకు అందిస్తున్న సేవ.. పింఛన్లు ఇవ్వడం, ఇతర పథకాల అమలుకు సహాయకారులుగా వినియోగించడమే. ఇవే పనులను 2 వేల జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన సచివాలయంలోని ఉద్యోగులతోనూ సులువుగా చేయించవచ్చు. అలాగైతే జగన్ రాజకీయ ప్రయోజనాలు నెరవేరవు. అందుకే వాలంటీర్లను తెరముందు పథకాల అమలు కోసమని చెబుతూ, తెరవెనుక రాజకీయ సామ్రాజ్యానికి పునాదుల్లాగా మార్చుకున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా అమలు చేసేందుకని నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్లు పూర్తిగా అధికార పార్టీ వ్యవహారాల్లో నిమగ్నం అవుతున్నారు. తాజాగా విజయవాడలో నిర్వహించిన వైసీపీ ప్రతినిధుల సభా ప్రాంగణంలో వాలంటీర్లు సహాయకులుగా పని చేశారు.

జిల్లాల్లోనూ పార్టీ సమావేశాలకు ప్రజల సమీకరణ బాధ్యతలను వాలంటీర్లకే అప్పగిస్తున్నారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనరాదని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చినా లెక్కలోకి తీసుకోవడం లేదు. ఓటర్ల పరిశీలనలో ఇప్పటికీ వారే క్రియాశీలంగా ఉంటున్నారు. సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థను రాజ్యాంగ నిర్దేశాలకు విరుద్ధంగా వాడుకుంటున్న తీరు విమర్శలకు తావిస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.