అభివృద్ధి చెందిన భారతదేశం కోసం 'వికసిత్ సంకల్ప యాత్ర' తొలి అడుగు - విజయవాడలో వికసిత్​ భారత్​ సంకల్ప యాత్ర

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 9:36 PM IST

Vikasit Bharat Sankalpayatra : కోట్లాది మంది పౌరుల్లో నిర్లక్ష్య భావన లేకుండా చేయడమే వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర లక్ష్యమని గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్‌నజీర్‌ అన్నారు. 'అభివృద్ధి చెందిన భారతదేశం' కలను నెరవేర్చడానికి ఈ యాత్ర ఓ ముందడుగని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సంకల్పయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అర్హులకు, బలహీన వర్గాలకు పథకాలు అందజేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. మహిళా సాధికారతకు ప్రధాని నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు గవర్నర్​తో వికసిత్‌ భారత్ సంకల్ప్ యాత్ర ప్రతిజ్ఞ చేయించారు.  

About Sankalpayatra : కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోంది. ఆ పథకాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల లబ్ధిదారులకు అందడంలేదని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం వికసిత్​ భారత్​  సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ సంకల్పయాత్ర ప్రాధాన్యతను తెలిపిన అనంతరం ఐఈసీ గోడ చిత్రాన్ని గవర్నర్ ఆవిష్కరించారు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.