క్యాన్సర్​ను పూర్తిగా నిర్మూలించే రోజు చూడాలి- వెంకయ్యనాయుడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 8:23 AM IST

Venkaiah Naidu Speech In 83rd Annual Conference: అందరికీ సమాన వైద్య సదుపాయం అందేలా వైద్యులు కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. దేశ జనాభాలో 60 శాతం గ్రామీణ ప్రజలకు పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకునే సామర్థ్యం లేదని గ్రామీణ ప్రాంతాలపై వైద్యులు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. భారత సర్జన్ల సంఘం 'ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా' ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన 83వ వార్షిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎలాంటి లాభం ఆశించకుండా వైద్య వృత్తిని నిర్వహించాలన్నారు.

 వైద్యులే దేవుళ్లుగా భావించే సాధారణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వీలైనంత గొప్పగా సేవలందించాలని తెలిపారు. ఆలోచనలు పంచుకోవడానికి ఎసికాస్ సదస్సు ఒక గొప్ప అవకాశం అన్నారు. ఇలాంటి వేదికలపై సీనియర్ల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని నైపుణ్యం మెరుగుపరచుకోవాలి. దేశంలో అత్యధికంగా మరణాలకు కారణమవుతున్న రోగాల్లో క్యాన్సర్ ఒకటి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. క్యాన్సర్​ను పూర్తిగా నిర్మూలించే రోజు చూడాలని ఆశిస్తున్నాను. ఈ క్రమంలోనే జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్‌ పి.రఘురామ్, విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యుడు, కామినేని ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్‌ కె. పట్టాభిరామయ్యకు (A.S.I) జీవిత సాఫల్య పురస్కారాలను అందజేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.