Varla on AP Police: "అధికార పార్టీ వారిపై బెయిలబుల్​.. ప్రతిపక్షాలపై నాన్​ బెయిలబుల్​ కేసులు" - Varla on AP Police

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 18, 2023, 7:23 PM IST

TDP Varla Ramaiah Comments on Police Department: పోలీసు శాఖలోనూ కులవివక్షత చోటు చేసుకోవటం దురదృష్టకరమని టీడీపీ పొలిట్​ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి అనుకూలమైన కూలాలకు చెందిన వారికే పోలీసు శాఖలో ఉన్నత స్థానాల్లో పోస్టింగులు ఇస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వటం లేదని వర్ల ఆరోపించారు. ఉన్నత స్థానాల్లో పోస్టింగులను గమనిస్తే పది స్థానాల్లో.. తొమ్మిది పోస్టింగులు అధికార పార్టీకి నచ్చిన కులానికే ఇస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టినప్పుడు పోలీసులు వారిని బతిమిలాడుతారని.. ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టినప్పుడు లాఠీఛార్జీలు చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలపై బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారని​.. ప్రతిపక్షాలపై నాన్ ​బెయిలబుల్​ కేసులు పెట్టి.. కస్టడీలోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు ప్రైవేటు సైన్యంగా మారారు తప్పా.. వారి విధులు వారు నిర్వహించటం లేదని మండిపడ్డారు. పోలీసు శాఖలో వివక్షతతో వ్యవహరించడం వల్ల అట్టడుగు వర్గాల ప్రజలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.