Mahaganapati Temple: అన్నమయ్య జిల్లాలో అంగరంగ వైభవంగా వరసిద్ధి వినాయక కళ్యాణం - మహాగణపతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 10, 2023, 4:37 PM IST

First Anniversary of Mahaganapati Temple: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం గంగురాజుపోడు గ్రామంలో జూన్ 10న మహాగణపతి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ జరిగింది. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు హాజరయ్యారు. మహాగణపతి దేవాలయ ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. గణపతి పూజ, స్వస్తి వాచకము, కలశస్థాపన, మహా గణపతికి పంచామృతాభిషేకము, గణపతి హోమము, రుద్ర హోమం, నవగ్రహ శాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వరసిద్ధి వినాయక కళ్యాణానికి హాజరయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి భక్తులకు అన్నదానం చేశారు. మహా గణపతిని దర్శిస్తే మంచి జరుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. దీనివలన ఈ కార్యక్రమానికి తండోపతండాలుగా ప్రజల హాజరై విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరున్ని దర్శించుకున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.