ETV Bharat / state

గురువారం ఏపీ కేబినెట్ మీటింగ్ - చర్చకు రానున్న కీలక అంశాలు ఏంటంటే! - AP CABINET MEETING

గురువారం ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం - రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులు సహా వివిధ అంశాల పై చర్చ!

AP Cabinet Meeting
AP Cabinet Meeting (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2024, 10:30 PM IST

AP Cabinet Meeting : రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులు సహా వివిధ అంశాలపై రాష్ట్ర కేబినెట్ గురువారం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఆర్డీఏ ఆధారిటీ స‌మావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలియజేయనుంది. అలాగే వివిధ ప‌రిశ్ర‌మ‌లకు భూ కేటాయింపుల‌కు కేబినెట్ ఆమోదించే అవ‌కాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రతిపాదించిన అంశాలను మంత్రి వ‌ర్గంలో చ‌ర్చించనున్నారు.

రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన ట్రంక్ రోడ్లు, లే అవుట్ లలో మౌలిక వసతులు కల్పన, ఐకానిక్ బిల్టింగ్ లకు సంబంధించి మొత్తం రూ. 24,276 కోట్ల పనులకు పాల‌న‌ప‌ర‌మైన ఆమోదం కోసం గురువారం మంత్రి వ‌ర్గం ముందుకు రానుంది. ఇందులో భాగంగా 103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భ‌వ‌నం నిర్మాణానికి అనుమ‌తులు ఇవ్వ‌నున్నారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి టవర్ పైనుంచి సిటీ మొత్తం చూసేలా అసెంబ్లీ భ‌వ‌నం నిర్మాణం చేయ‌నున్నారు. రాజధానిలోని గవర్నమెంట్ సిటి లో 20 లక్షల 32 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో 42.3 ఎకరాల్లో నిర్మించే హైకోర్టు భ‌వ‌నం నిర్మాణం కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం కోసం రానుంది.

రాజధాని నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడంపై ప్రభుత్వం ఫోకస్

ఐదు టవర్​లకు రూ. 4,608 కోట్లు : 55 మీటర్లు ఎత్తులో నిర్మించే హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి రూ.1048 కోట్లు ఖర్చు కానుంది. వీటితో పాటు జీఎడీ టవర్, హెచ్ఓడీల టవర్లు మొత్తం ఐదింటిని నిర్మాణం చేయ‌నున్నారు. అన్ని టవర్లు కలిసి 68 లక్షల 88 వేల 64 చదరపు విస్తీర్ణంలో నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. ఐదు టవర్ లకు గాను మొత్తంగా రూ. 4,608 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అన్ని టెండర్ లను డిసెంబర్ నెలాఖరుకు ముగించి పనులు చేపట్టేలా కేబినెట్ లో ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. 2025 జనవరి నుంచి రాజధాని నిర్మాణాలు పూర్తి స్ధాయిలో ప్రారంభం చేయాల‌న్న సీఆర్డిఏ ప్ర‌తిపాద‌న‌లకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలపనుంది.

మరోవైపు గతంలో విజ‌య‌వాడ బుడ‌మేరు ముంపుతో న‌ష్ట‌పోయిన బాధితుల‌కు రుణాల రీ షెడ్యుల్ కోసం స్టాంపు డ్యూటీ మిన‌హాయింపు చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. రెవెన్యూ శాఖ నుంచి ఈ ప్ర‌తిపాద‌న మంత్రివ‌ర్గ స‌మావేశం ముందుకు రానుంది. అలాగే రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో ప‌రిశ్ర‌మ‌ల‌కు భూ కేటాయింపుల‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలియచేసే అవకాశం ఉంది. మంగ‌ళ‌గిరిలో ఉన్న ఎయిమ్స్ సంస్ధ‌కు మ‌రో ప‌ది ఎక‌రాలు భూ కేటాయింపు ప్రతిపాదనకు కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంది. వీటితో పాటు రెవెన్యూశాఖకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలు కూడా గురువారం కేబినెట్ ముందుకు రానున్నాయి.

మూడేళ్లలో రాజధాని పూర్తి - గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు : మంత్రి నారాయణ

ఇక జెట్ స్పీడ్​లో అమరావతి పనులు - రాజధానిలో మరో రూ.24,276 కోట్ల పనులకు ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.