An Unidentified Drone Flew Over Dy CM Pawan Kalyans Camp Office : ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగరడం చర్చనీయాంశంగా మారింది. మంగళగిరిలోని నిర్మాణంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయ భవనంపై ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరవేశారు. భద్రతాపరమైన కారణాలను దృష్టిలో ఉంచుకుని డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు పవన్‌కల్యాణ్ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఇటీవల పవన్‌కల్యాణ్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ హడావుడి చేశారు.
విజయవాడ పుస్తక మహోత్సవంలో పవన్ స్టాల్స్ దగ్గర ఉండగా విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి నిర్మాణంలో ఉన్న జనసేన కార్యాలయం పై డ్రోన్ ఎగరడంతో జనసేన శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. పవన్ భద్రత విషయంలో పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై స్పందించిన పోలీసులు డ్రోన్‌ని ఎవరు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారనే అంశంపై దర్యాప్తు చేపట్టారు. డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం, జాతీయ రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.


5 లక్షలు పెట్టి పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్ - ఏమేం కొన్నారంటే?
తప్పు లేదంటే ఎలా? క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు: పవన్ కల్యాణ్