కడప అమీన్ పీర్ దర్గాలో ఉరుసు ఉత్సవాలు - సీఎం జగన్ హాజరయ్యే అవకాశం - ఉరుసు ఉత్సవాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 3:17 PM IST
Urusu Utsavam at Kadapa Dargah: మత సామరస్యానికి ప్రతీకైన కడప అమీన్ పీర్ దర్గాలో (పెద్ద దర్గా) ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ( నవంబరు 25 ) నుంచి ఐదు రోజుల పాటు ఉరుసు ఉత్సవాలు జరగనున్నాయని దర్గా మేనేజర్ అలీ ఖాన్ తెలిపారు. నవంబరు 25న గంధం ఉత్సవం, 26న ఉరుసు ఉత్సవం, 27న జాతీయ ఉర్దూ కవి సమ్మేళనం, ముషాయిరా, 28న తహలీ, 29న వాటర్ గండి వద్ద ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏదో ఒకరోజు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
ఏడాదికొకసారి కన్నుల పండగా జరిగే ఉరుసు ఉత్సవాలకు.. తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, కేరళలోని భక్తులు కూడా భారీ సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. ఈ ఉత్సవాలను వీక్షించడానికి.. దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.