ఉరుసు ఉత్సవాల్లో గంధోత్సవం - పూల చాదర్ సమర్పించిన ఏఆర్ రెహమాన్ - AR Rehman as chief guest in urusu utsav

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 12:02 PM IST

Urusu Utsav at Amin Peer Dargah : కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో(Urusu Utsav) భాగంగా గంధోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష ( Deputy Chief Minister Amjad badshah), ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rehman) హాజరయ్యారు. గంధోత్సవానికి ప్రత్యేకంగా తీసుకొచ్చిన పూల చాదర్​ను స్వామివారికి సమర్పించారు.

Amin Peer Dargah Gandotsava  Celebrations  in Kadapa district: దక్షిణాది అజ్మీర్​గా ప్రసిద్ధిగాంచిన కడప జిల్లాలో అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా)లో ఉరుసు ఉత్సవాలు నిర్వహించారు. ఉరుసు సందర్భంగా దర్గా విద్యుత్‌ దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతీరింది. ఈ ఉత్సవాన్ని తిలకించిందేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మెుక్కులు తీర్చుకున్నారు. రాత్రి 9.30 గంటలకు పీఠాధిపతి నివాసం నుంచి ఊరేగింపుగా గంధం తీసుకువచ్చి పూలచాదర్​ను భక్తి శ్రద్దలతో సమర్పించారు. డప్పు వాయిద్యాలు, పకీర్ల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గంధోత్సవాన్ని దర్గా పీఠాధిపతి అరిఫుల్ల హుస్సేని దగ్గరుండి నిర్వహించారు. సోమవారం కూడా ఉరుసు ఉంటుందని దర్గా మేనేజరు అలీఖాన్, నిర్వాహకులు అమీర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.