Unemployed Protest for DSC Notification at Varahi Sabha: డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిరుద్యోగుల ఆందోళన.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ పవన్‌కు వినతి పత్రం.. - కృష్ణా జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-10-2023/640-480-19655770-thumbnail-16x9-dsc.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2023, 6:50 PM IST
Unemployed Protest for DSC Notification at Varahi Sabha: మెగా డీఎస్సీ అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి మెగా మోసం చేశారని.. డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా హామీ నెరవేర్చలేదని మండిపడుతున్నారు. న్యాయం చేయాలంటూ పనన్ కల్యాణ్ అవనిగడ్డ వారాహి యాత్ర సభా ప్రాంగణం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల సంఖ్య 50వేలకు పెరిగిందని, లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. డీఎస్సీ కోసం వేల రూపాయల ఫీజులు కట్టి శిక్షణ తీసుకున్న తాము.. నోటిఫికేషన్ లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాల విలీనానికి కారణమైన 117 జీవోను రద్దు చేయాలని నిరుద్యోగులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ విడుదల చేసేలా పవన్.. వైసీపీ సర్కారుపై ఒత్తిడి తేవాలని జనసేనానికి వినతి పత్రాన్ని అందించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతామంటున్న నిరుద్యోగులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి..