Two Governor Quota MLC Notification Issued: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పద్మశ్రీ, రవిబాబు - 2 Governor quota MLCs nominated
🎬 Watch Now: Feature Video
Two Governor Quota MLC Notification Issued: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు శాసన మండలి సభ్యుల స్థానాలు భర్తీ చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ నామినేట్ చేసిన కర్రి పద్మ శ్రీ , కుంభా రవి బాబులను ఆ కోటా కింద భర్తీ చేస్తూ జీవో విడుదల చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న శివనాధ్ రెడ్డి, ఎన్.ఎండీ ఫరూక్ల పదవీ కాలం జూలై 20 తేదీతో ముగియటంతో ఆ ఖాళీల్లో వీరిని భర్తీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా జీవో నెంబర్ 87ను జారీ చేశారు. గవర్నర్ నామినేట్ చేసిన శాసన మండలి సభ్యుల పదవీ కాలం నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి ఆరు సంవత్సరాల పాటు ఉంటుందని ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.