జగన్ పుట్టినరోజును రాష్ట్ర ప్రభుత్వం నమ్మకద్రోహ దినంగా ప్రకటిస్తే మంచిది : తులసిరెడ్డి - update news ysr district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 3:55 PM IST
Tulsi Reddy Press Conference : ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజును రాష్ట్ర ప్రభుత్వం నమ్మకద్రోహ దినంగా ప్రకటిస్తే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి సలహా ఇచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులందరికీ మాటలు చెప్పి మోసం చేశారని ఆక్షేపించారు. ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు.
Jagan Who Cheated People : రైతులకు ధరల స్థిరీకరణ నిధితోపాటు పండించిన పంటలను నిల్వ చేసుకోవడానికి శీతల గిడ్డంగులను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని తులసి రెడ్డి గుర్తు చేశారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సొంత నియోజకవర్గంలోనే నిర్మించలేని ముఖ్యమంత్రి ఇక రాష్ట్రానికి ఏం మేలు చేస్తాడని విమర్శించారు. ఈ విధంగా అన్ని వర్గాలకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఇవాళ పుట్టిన రోజు ఏ విధంగా జరుపుకొంటారని ప్రశ్నించారు.