Minister Nara Lokesh On ASER Report : జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో విద్యా వ్యవస్థలో జగన్ చేసిన విధ్వంసం బయటపడిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ జగనే అని మరోసారి రుజువైందన్నారు. జగన్ ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యిందని దుయ్యబట్టారు. 2018లో నాటి టీడీపీ హయాంలో మెరుగ్గా ఉన్న ప్రభుత్వ విద్యా ప్రమాణాలు వైఎస్సార్సీపీ పాలనలో ఎలా దిగజారాయో అసర్ నివేదికలో స్పష్టంగా వెల్లడించిందన్నారు.
7 నెలలుగా అనేక చర్యలు : అడ్డగోలు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల మూసివేతకి జగన్ కారణం అయ్యారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. దీంతో అక్షరాలు, అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు ఉన్నారని విమర్శించారు. అలాగే తగ్గిన హాజరు శాతం, తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ఇలా అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతున్నాయని మండిపడ్డారు. 8వ తరగతి విద్యార్థుల్లో దాదాపు సగం మంది 2వ తరగతి పుస్తకాలు సరిగా చదవలేని పరిస్థితి నెలకొందన్నారు. విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు గత 7 నెలలుగా అనేక చర్యలు తీసుకున్నానని స్పష్టం చేశారు. నిరంతరం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటూ అనేక మార్పులకు నాంది పలికామని లోకేశ్ వెల్లడించారు.
జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడింది. ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైంది. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం… pic.twitter.com/VPGUkowB40
— Lokesh Nara (@naralokesh) January 29, 2025
ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు? అని పక్కా లెక్కలు తీయడం దగ్గర మొదలుపెట్టి మారుతున్న కాలానికి తగ్గట్టుగా పాఠ్యప్రణాళిక సిద్ధం చేయడం వరకూ దృష్టి పెట్టామన్నారు. అలాగే విలువలతో కూడిన విద్య, విద్యార్థులను క్రీడలతో సహా ఇతర రంగాల్లో ప్రోత్సహించే గైడెన్స్ ఇవ్వడం, కనీస మౌలికవసతులు కల్పించడం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం వరకూ అనేక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నానని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెచ్చేందుకు ప్రజలు, విద్యావేత్తల అభిప్రాయాలు స్వీకరిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
త్వరలో ప్రతి శనివారం 'నో బ్యాగ్డే' - ఉపాధ్యాయులకు ఒకటే యాప్: మంత్రి లోకేశ్
విద్యార్థి పేరు తప్పు - NTAతో మాట్లాడిన మంత్రి లోకేశ్ - 30 నిమిషాల్లో ప్రాబ్లం సాల్వ్