Tulasi Reddy on Jagan: జగన్ రెడ్డీ పేరును బాదుడు రెడ్డిగా మార్చుకుంటే మంచిది: తులసిరెడ్డి
🎬 Watch Now: Feature Video
Tulasi Reddy comments on Jagan: కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొట్టడం సహజం కాని వైసీపీ పాలనలో తీగ పట్టుకోనవసరం లేదు కరెంట్ బిల్లు చూస్తే సరిపోతుందని పీసీసీ మీడియా చేర్మెన్ తులసి రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో తులసి రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో కరెంటు చార్జీలు పెంచుడే పెంచుడు అని విమర్శించారు. జగన్ రెడ్డీ తన పేరును భాధుడు రెడ్డిగా మార్చుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.. గడచిన నాలుగు సంవత్సరాలలో ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారని ఆరోపించారు.. దీని వల్ల అదనపు భారంగా.. 17 వేల 723 కోట్ల రూపాయలు పడుతుంది.. సర్దుబాటు చార్జీల పేరుతో మళ్లీ రూ 11 వేల 270 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అన్నారు.. గృహాలకు స్మార్ట్ మీటర్ల పేరుతో రూ 13 వేల కోట్లు, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల పేరుతో రూ 6 వేల 888 కోట్లు అదనపు భారం మోపుతున్నారని అన్నారు.. ప్రజలు వైసీపీకు రివర్స్ షాక్ ఇవ్వక తప్పదని అన్నారు.. వైసీపీ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తులసిరెడ్డి అన్నారు. విశాఖ సంఘటన దీనికి పరాకాష్ట. అని పీసీసీ మీడియా చేర్మెన్ తులసిరెడ్డి అన్నారు.