TTD Employee Suicide Attempt in Peruru: వైసీపీ నేత వేధింపులు.. టీటీడీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం - టీడీపీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 1:32 PM IST
TTD Employee Suicide Attempt in Peruru: వైసీపీ నాయకుడు వేధింపులకు గురిచేయడంతో టీటీడీ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తిరుపతి రూరల్ మండలం పేరూరులో చోటుచేసుకుంది. పేరూరు పంచాయతీకి చెందిన కాయం మునుస్వామి టీటీడీ ఫారెస్టు విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. సొంత స్థలంలోని తన ఇంటికి రోడ్డు నిర్మించుకుంటున్నారు. రోడ్డు వల్ల తన ఇంటి స్థలానికి వీధిపోటు వస్తుందని భావించిన స్థానిక వైసీపీ నేత చెంచుమోహన్ యాదవ్.. ఆ పనులను ఆడ్డుకున్నారు. రోడ్డు నిర్మాణాన్ని నిలిపేయాలని, లేకుంటే తనకు 50 లక్షల నగదు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. ఈ విషయాన్ని గురించి గ్రామ సర్పంచ్‌తో పాటు కలెక్టర్, ఎస్పీకి స్పందన కార్యక్రమంలో మునుస్వామి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంపై ఆగ్రహించిన వైసీపీ నేత.. మునుస్వామి ఇంటికి కుళాయి కనెక్షన్ కట్ చేయించారు. ఇంటికి వెళ్లే రోడ్డుకు అడ్డంగా గుంత తవ్వించారు. దీంతో మనస్తాపానికి గురైన మునుస్వామి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.