తప్పుడు కేసులు పెట్టి చిన్నచూపు చూస్తున్నారు - 'ఎమ్మెల్యే గో బ్యాక్‌' అంటూ గిరిజనుల ఆందోళన - విజయనగరంలో గిరిజనలు నిరసన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 8:37 AM IST

Tribal Youth Protest Against YSRCP MLA Kadubandi Srinivasa Rao :  శృంగవరపుకోట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే  కడుబండి శ్రీనివాసరావుకి గిరిజన యువకుల నుంచి నిరసన సెగ తగిలింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. శనివారం రాత్రి అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేను 'గో బ్యాక్‌ ఎమ్మెల్యే' అంటూ గిరిజనులు నినాదాలు చేశారు. తమ గ్రామంలోని గిరిజనులపై తప్పుడు కేసులు పెడుతూ చిన్నచూపు చూపిస్తున్న ఎమ్మెల్యే వెళ్లిపోవాలంటూ నినదించారు. ఓ విధీలో ఇంటింటికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

Go Back MLA Kadubandi Srinivasa Rao : అమాయకులైన గిరిజనులను రౌడీ మూకలు అని ముద్రవేస్తున్నారనీ, కోర్టులలో ఉన్న భూములను తప్పుడు రిజిస్ట్రేషన్లతో ఆక్రమించాలని చూస్తున్నారని,  గిరిజనుల్ని బానిసలుగా చూస్తున్నారని, చదువుకున్న వారి మీద తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని గిరిజనులు ప్లకార్డులు ప్రదర్శించారు. 'గో బ్యాక్‌ ఎమ్మెల్యే' అంటూ నినదించారు.

Gadapa Gadapaku Mana Prabhutvam Program in Vizianagaram District : ప్లకార్డులతో ఉన్న నిరసనకారులను ఎమ్మెల్యే దగ్గరకి వెళ్లకుండా పోలీసులు నిలువరించారు. వారి వద్ద ఉన్న ప్లకార్డులను పోలీసులు తీసుకున్నారు. గ్రామ సమస్యలపై వైఎస్సార్సీపీ నాయకులు జోక్యం చేసుకోవడాన్ని తప్పుపడుతూ  వారికి ఇక్కడ పనేమిటని పోలీసులతో గిరిజనులు వాగ్వాదానికి దిగారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.