సంక్రాంతి బస్సుల్లేవ్- రయ్ రయ్ మంటున్న బైకులు!
🎬 Watch Now: Feature Video
Sankranti Rush Leads to Traffic Jam in AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్ నుంచి నందిగామకు సంక్రాంతి పండక్కి వచ్చేందుకు ఆంధ్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సు లేకపోవడంతో చార్జీలు ఎక్కువ ఉండటంతో బైకులు, స్కూటీ ల పైన జనం స్వగ్రామాలకు వస్తున్నారు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల చార్జీలు విపరీతంగా ఉండటంతో ద్విచక్ర వాహనాల వస్తున్నట్లు చెబుతున్నారు. వందల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ ప్రయాణం చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, తణుకు, అవనిగడ్డ, గూడూరు, విజయవాడ.. ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బైకులపై వెళ్తున్నారు.
మరోవైపు కోనసీన జిల్లా రావులపాలెంలోని జాతీయ రహదారి వాహనాల రద్దీతో కిటకిటలాడుతోంది. ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు విపరీతంగా టికెట్ ధరలు పెంచటం, ఆర్టీసీ బస్సులు సరిపడాలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేదేమీలేక సొంత వాహనాల్లో స్వగ్రామాలకు పయణమవుతున్నారు. దీంతో ఈతకోట టోల్‌గేట్ వద్ద భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు వెళ్లె వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పినప్పటికీ, పండక్కి వెళ్లెందుకు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.