Tomatos on Subsidy: రూ 50కే కేజీ టమాటా.. క్యూ కట్టిన జనం.. ఎక్కడంటే..! - 50 rupees per kg tomato in Kurnool Rythu Bazar
🎬 Watch Now: Feature Video
50 rupees per kg tomato in Kurnool: మార్కెట్లో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా ధర రూ 100కు చేరింది. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయినందున.. వారం రోజుల్లోనే టమాటా ధర రెట్టింపు అయ్యింది. వర్షాలు, వేడి గాలుల ప్రభావం వల్ల పంట దిగుబడి తగ్గిపోయి మార్కెట్లో టమాటాకు డిమాండ్ పెరిగిపోయింది. కాగా ఈ సంవత్సరం రైతులు కొత్త పంటల వైపు దృష్టి పెట్టడం కూడా టమాటా ధర పెరుగుదలకు ఒక కారణమని వ్యాపారులు అంటున్నారు. టమాటా ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కర్నూలు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటాలను రైతు బజార్లలో సబ్సిడీ ధరలతో ప్రజలకు అందిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో 100 రూపాయలు ఉండగా.. రైతు బజార్లో 50 రూపాయలకే ఇస్తున్నారు. తక్కువ ధరకు ఇవ్వడంపై కర్నూలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వినియోగదారునికి కిలో మాత్రమే ఇస్తున్నారు. దీంతో టమాటాల కోసం ప్రజలు భారీగా క్యూలైన్లో నిలబడి తీసుకొని పోతున్నారు.