Tomato Prices: సబ్సిడీ టమాటాల కోసం ప్రజల అవస్థలు.. రైతు బజార్లలో గంటల తరబడి పడిగాపులు - ఎన్టీఆర్ జిల్లాలో సబ్సిడీపై టమాటాలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-08-2023/640-480-19188185-473-19188185-1691224291713.jpg)
Tomato Price Hike: గత కొన్ని రోజులుగా టమోటా ధరలు భగ్గుమంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో.. టమోటాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న టమోటాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టమోటాల కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉంటూ అవస్థలు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ రైతు బజారులో కిలో టమోటాల ధర 108 రూపాయలు పలుకుతోంది. దీంతో ప్రభుత్వం సబ్సిడీ ద్వారా 50 రూపాయలకు అందిస్తున్న టమోటాల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా సుమారు 300 మీటర్ల వరకు క్యూలో వేచిఉంటున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న టమాటాల కోసం వస్తే గంటల తరబడి లైన్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు వారాల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని రైతు బజారు అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత క్రమంగా టమోటాల ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.