మూడు రాష్ట్రాలకు తలనొప్పిగా మారిన అంతర్రాష్ట నేరస్థుడు - ఎట్టకేలకు అరెస్టు చేసిన ఏపీ పోలీసులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 2:26 PM IST

Three Thieves Arrested by Anantapur Police:జిల్లాలో వేర్వేరు పోలీస్​స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మొత్తం రూ.12 లక్షల విలువ చేసే 23.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ దొంగతనాలకు సంబంధించిన వివరాలను  ఎస్పీ అన్బురాజన్ పోలీసు కాన్ఫరెన్స్ హాలులో వెల్లడించారు.  

Police Arrested Three Thieves Who Involves in Robbery:మూడు రాష్ట్రాల్లో వరుసగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు తలనొప్పిగా మారిన ఒక అంతర్ రాష్ట్ర దొంగను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కల్యాణదుర్గానికి  చెందిన పీట్ల గంగాధర్.. సాంబగా పేరు మార్చుకుని ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. ఇటీవల తెలంగాణ ప్రాంతంలో ఒక చోరీ కేసులో అరెస్టై రిమాండ్​కు వెళ్లాడు. బయటికి వచ్చి నగరంలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడ్డాడు. ముందుగా రెక్కీ నిర్వహించి అనంతరం గంగాధర్ దొంగతనాలకు పాల్పడుతుంటాడు. అయితే పోలీసులు ఇటీవల జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టి గంగాధర్​ను అరెస్టు చేశారు. మరోవైపు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చోరీలు చేస్తున్న మరో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నార్పలకు చెందిన సుభాష్, గుంతకల్లుకు చెందిన పవన్ బహదూర్ అనే ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.