Three Dead in Road Accident at Yarnagudem: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ముగ్గురు మృతి - Three killed in a road accident
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 5, 2023, 11:05 AM IST
Three Dead in Road Accident at Yarnagudem : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరం.. చిన్నాయిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై యర్నగూడెం నుంచి అనంతపల్లి వెళుతూ ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ (Two-Wheeler Hit a Parked Lorry From Behind) కొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా మరో యువకుడిని కొవ్వూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. మృతి చెందిన వారు చిన్నాయిగూడెం గ్రామానికి చెందిన బొందల శ్రీను(23), వేము సునీల్ కుమార్(28), బబ్లూ(22) లుగా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఒకే ఊరికి చెందిన ముగ్గురు యువకులు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి.