ETV Bharat / state

గ్రీన్​ఫీల్డ్ హైవే - అవస్థలు పడుతున్న రైతులు - GREEN FIELD NATIONAL HIGHWAY

హైదరాబాద్‌ - విశాఖ మధ్య దూరం తగ్గేలా గ్రీన్‌ఫీల్డ్ హైవే - ఏలూరు రైతులకు తలనొప్పిగా మారిన నిర్మాణం

green_field_national_highway
green_field_national_highway (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 12 hours ago

Green Field National Highway : హైదరాబాద్‌ నుంచి విశాఖ మధ్య దూరం తగ్గేలా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి పనులు ఏలూరు జిల్లా రైతులకు తలనొప్పిగా మారాయి. పరిహారం విషయంలో ఇప్పటికే అనేక సార్లు రోడ్డెక్కిన రైతులు ఇప్పుడు మిగిలిన పంట పొలాలను ముంపు నుంచి కాపాడుకునేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం పూర్తయితే భవిష్యత్‌లో పొలాలకు వెళ్లే దారి కోసం పోరాడాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమయ్యే గ్రీన్ ఫీల్డ్ హైవే దేవరపల్లి మీదుగా సాగి రాజమహేంద్రవరం వెళ్తుంది. 162 కిలోమీటర్ల ఈ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి పనులు చివరిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖ, రాజమండ్రి వెళ్లే వాహనాలు విజయవాడ మీదుగా వెళ్తుండగా ఈ రహదారి అందుబాటులోకి వస్తే దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.

రాష్ట్రంలో హైవేలపై 18 ఫ్లైఓవర్ల నిర్మాణం - మిథున్‌రెడ్డి ప్రశ్నకు గడ్కరి వివరణ

రాష్ట్రంలో ప్రధానంగా ఏలూరు జిల్లా మీదుగా ఈ గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి వెళ్తోంది. జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల మీదుగా వెళ్లే రహదారి కోసం బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే భూములు సేకరించారు. దీనిపై అప్పట్లో పెద్దఎత్తున రైతుల నుంచి నిరసన వెల్లువెత్తినా, పలుమార్లు ఆందోళనలు చేసినా అధికారులు, గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రహదారి భూ సేకరణ పరిహారం విషయంలో ఇప్పటికే నష్టపోయిన రైతులకు ఇప్పుడు కొత్త కష్టాలు వెక్కిరిస్తున్నాయి.

ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో పక్కనే ఉన్న చెరువు పొంగి గతంలో నీళ్లు కిందికి వెళ్లేవి. ప్రస్తుతం గ్రీన్‌ఫీల్డ్ రహదారి అడ్డుగా ఉండటంతో ఆ నీరంతా పంట పొలాలను ముంచెత్తుతోంది. పొలాల్లో భారీగా గండ్లు పడుతున్నాయి. నీరు వెళ్లేందుకు జాతీయ రహదారి కింద నుంచి చిన్నపాటి అండర్‌పాస్ ఇచ్చినా అది ఏమాత్రం సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. రోడ్డు నిర్మాణ సమయంలోనే ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదంటున్నారు.

జాతీయ రహదారి నిర్మాణం తర్వాత చాలా మంది రైతులకు చెందిన పొలాలు రెండు ముక్కలుగా మారాయి. జాతీయ రహదారికి ఒకవైపు కొంత, మరోవైపు కొంత మిగిలాయి. రైతులకు వ్యవసాయ పనులు చేసుకోవడం తలనొప్పిగా మారింది. ఆయకట్టులో ఈ చివర ఉన్న రైతు అవతలి వైపు వెళ్లాలంటే అండర్ పాస్ నుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. పలువురు రైతులకు వ్యవసాయ బోర్లు జాతీయ రహదారికి ఇవతల ఉండగా అవతలివైపు మిగిలిన ఉన్న చిన్నముక్కకు నీరు అందించడం కష్టంగా మారింది.

గ్రీన్ ఫీల్డ్ హైవే కావడంతో రహదారిపై సాధారణ రాకపోకలు నియంత్రిస్తారని భవిష్యత్‌లో తమ పొలాలకు వెళ్లేందుకు, పంట ఉత్పత్తులు తీసుకొచ్చేందుకు ఇబ్బందిగా మారనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

జాతీయ రహదారుల పనులు - భూసేకరణ వివరాలు అడిగిన కేంద్రం

మల్లన్న దారిలో మనసు దోచే భారీ నిర్మాణం - ప్రకృతి ఒడిలో 'పైదారి'లో ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.