అంగరంగ వైభవంగా శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి తిరునాళ్లు - మార్గశిర పౌర్ణమి ప్రత్యేకం - తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 3:12 PM IST

Thirunallu Mahotsavam of Sri Kota Satyamma in East Godavari : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి తిరునాళ్లు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మార్గశిర పౌర్ణమి రోజు అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా ఐదు రోజులు పాటు తిరునాళ్లు నిర్వహించడం అనవాయితీగా వస్తుందని దేవస్థానం సభ్యులు తెలియజేశారు. సత్తెమ్మ అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా ఉదయమే శాస్త్రోక్తంగా అన్ని పూజలు నిర్వహించారు. పండితుల వేద మంత్రోచ్ఛారణ మధ్య అమ్మ వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు.

Large Number of Devotees Visited the Goddess : మార్గశిర పౌర్ణమి రోజున అమ్మవారిని దర్శించుకుంటే సర్వశుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఐదు రోజులు పాటు జరిగే ఈ తిరునాళ్లులకు వేలల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. సత్తెమ్మ అమ్మవారిని ఉదయమే పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.