రాష్ట్రవ్యాప్తంగా ద్వాదశిని పురష్కరించుకుని పుణ్యక్షేత్రాల్లో ఘనంగా తెప్పోత్సవం
🎬 Watch Now: Feature Video
TEPPOTSAVAM IN AP TEMPLES: రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా వైభవంగా తెప్పోత్సవం జరిగింది. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ దిగువున ఉన్న పంపా సరోవరంలో హంస వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తి విగ్రహాలతో ఊరేగించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రంలో స్వామివారిని ఇంద్ర పుష్కరిణిలో హంస నావికోత్సవం జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి.. రంగనాయకుని అవతారంలో పుష్కరిణీలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కోనసీమ జిల్లా అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామివారికి వశిష్ఠ గోదావరిలో సుమారు మూడు కిలోమీటర్లు తెప్పోత్సవం నిర్వహించారు. విశాఖ సాగర తీరంలో క్షీరాబ్ది ద్వాదశీ సందర్భంగా విష్ణు హారతిని కొండవీటి జ్యోతిర్మయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో క్షీరాబ్ది ద్వాదశి ఉత్సవం వైభవంగా జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST