Anam Venkataramana Reddy on Anilkumar: "ఐపీఎల్ బెట్టింగ్, డ్రగ్స్ సరఫరాలో తాడేపల్లి ప్యాలెస్‌కు వాటా" - టీడీపీ అధికార ప్రతినిధి ఆనం
🎬 Watch Now: Feature Video

Anam Venkataramana Reddy Comments on Anil Kumar Yadav: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన బాబాయి రూప్ కుమార్ యాదవ్‌తో ఉన్న విభేదాలు తేల్చుకొని.. తమ యువనేత లోకేశ్‌పై విమర్శలు చేయాలని తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి హితవు పలికారు. గూడూరు నియోజకవర్గం తాడిమేడు యువగళం పాదయాత్ర బస ప్రాంతంలో ఆనం మీడియా సమావేశం నిర్వహించారు. మా నాయకుడు లోకేశ్ అమెరికాలో చదివాడని గర్వంగా చెప్పుకుంటామని.. మీనాయకుడు ఏం చదివాడో, ఎక్కడ చదివాడో చెప్పగలవా అని ప్రశ్నించారు. మాదకద్రవ్యాల సొమ్ము పంపకాల్లో తేడాలొచ్చి నిరాశ, నిస్పృహకు లోనైన అనిల్ కుమార్.. టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎప్పుడూ వరదలు రాని సర్వేపల్లి కాలువకు రక్షణ గోడలు కట్టించి, ప్రజల సొమ్ము కొట్టేసిన పెద్ద అవినీతిపరుడు అనిల్ కుమార్ అని ఆరోపించారు. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో అనిల్ కుమార్, రూప్ కుమార్ వాటాలతోపాటు, కొంతవాటా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిందని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నెల్లూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న డ్రగ్స్ మూలాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించి తెర వెనకున్న పెద్ద తలకాయల్ని తక్షణమే అరెస్ట్ చేయించి జైలుకు పంపాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.