BAC Meeting: బడ్జెట్ సమావేశాలను మార్చి 21 వరకూ నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 28న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. మార్చి 19న బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ఆమోదం పొందాక సభ వాయిదా పడటం ఆనవాయితీ. కానీ ఇతర అంశాలు ఏమైనా ఉంటే చర్చించేందుకు వీలుగా మార్చి 20, 21 తేదీలు రెండు రోజులు రిజర్వ్ దినాలుగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణుకుమార్ రాజు తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
అడిగితే కాదు ప్రజలిస్తే వచ్చేది - ఫిక్స్ అయిపోండి ప్రతిపక్ష హోదా రాదు: పవన్‌కల్యాణ్
11 నిమిషాలు నినాదాలు - గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్సీపీ