Kanna vs Ysrcp: వచ్చే ఎన్నికల్లో వైసీపీని అడ్రస్ లేకుండా ఓడిస్తాం: కన్నా లక్ష్మీనారాయణ - Kanna Lakshminarayana news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 2, 2023, 5:52 PM IST

Sattenapalle TDP incharge Kanna Lakshminarayana comments: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసే వైసీపీ అభ్యర్థిని అడ్రస్ లేకుండా ఓడిస్తామని.. కన్నా లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌‌గా పార్టీ అధినేత చంద్రబాబు తనను నియమించిన సందర్భంగా అందరి సమన్వయం, సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వ్యాఖ్యానించారు.

వైసీపీ అభ్యర్థిని అడ్రస్ లేకుండా ఓడిస్తాం..  సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ కన్నా లక్ష్మీ నారాయణ.. తాజాగా పార్టీ ముఖ్య నేత కుమార్తె పెళ్లికి వెళ్లలేకపోవటంతో ఇవాళ వారిని కలిశారు. అనంతరం ఆ నవ దంతులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌‌గా చంద్రబాబు తనను నియమించిన నేపథ్యంలో అందరి సమన్వయం, సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం 2024లో జరగబోయే ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థిని అడ్రస్ లేకుండా ఓడిస్తామన్నారు.

అందరి సమన్వయంతో పార్టీ కోసం కృషి చేస్తా.. ''గత 31వ తేదీన నన్ను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నన్ను ఆదరించి.. సహాయ, సహకారాలను అందిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో అందరి సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. నాయకులందరినీ కలుపుకోని రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తాము.''-కన్నా లక్ష్మీనారాయణ, సత్తెనపల్లి టీడీపీ ఇన్‌ఛార్జ్‌‌.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.