TDP Leader Dhulipalla Narendra on Sajjala Ramakrishna Reddy: 'సజ్జల తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు..ఎన్నికల ఫలితాల తరువాత మీ బతుకు ఏంటి?' - TDP Leader Dhulipalla Narendra comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 7:20 PM IST
TDP senior Leader Dhulipalla Narendra Harshly Criticized Sajjala Ramakrishna Reddy: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఘాటు విమర్శలు చేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో సీనియర్ క్లర్క్‌గా విధులు నిర్వర్తించే సజ్జల.. తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల ఫలితాల తరువాత బతుకు ఏంటి..? అనేది ఈ క్లర్క్ ఒకసారి ఆలోచించుకోవాలని దుయ్యబట్టారు.
సజ్జలపై ధూళిపాళ్ల నరేంద్ర ట్వీట్.. ''తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ సీనియర్ క్లర్క్ సజ్జల తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఒత్తిడి అవ్వొచ్చు లేదా ప్రస్టేషన్ అవ్వొచ్చు. కారణాలు ఏమైనా ఇతరుల బతుకుల గురించి మాట్లాడే అంత గొప్ప బతుకు ఆయనది, ఆయన యజమానిది కాదని సజ్జలు తెలుసుకోవాలి. బిడ్డల దగ్గరకు వెళ్లడానికి కోర్టు అనుమతి పొందాల్సిన నాయకుడి దగ్గర పని చేస్తూ.. ఇతరుల బతుకుల గురించి మాట్లాతుంటే జనం నవ్వుతున్నారు. రేపు మే నెలలో వచ్చే ఎన్నికల ఫలితాల తరువాత మీ బతుకు ఏంటి..? అనేది కూడా ఈ క్లర్క్ ఒకసారి ఆలోచించుకోవాలి.'' అని సామాజిక మాధ్యమాల వేదికగా టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర హితవు పలికారు.