బాబుతో నేను కార్యక్రమంతో దూసుకు వెళ్తున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు - madavi reddy in babu tho nenu program
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 3:07 PM IST
TDP Political Bureau Member Srinivas Reddy his Wife Babu Tho Nenu Program: కడప జిల్లా తెలుగుదేశం పార్టీ(tdp) సభ్యులు బాబుతో నేను కార్యక్రమంతో దూసుకు వెళ్తున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఆయన సతీమణి మాధవి రెడ్డి తనదైన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాధవి రెడ్డి టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. పర్యటనకు వెళ్లిన ప్రతి వార్డులో స్థానికంగా ఉన్న ఇతర పార్టీ కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇప్పటికే బాబుతో నేను కార్యక్రమాన్ని కడప వ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం చేశారు.
TDP Party Campaign in Cuddupah: కడపలోని 36వ డివిజన్లో ఎక్కువ మంది మైనార్టీలు ఉన్నారు. తాజాగా ఈ వార్డులో కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ వార్డు వైసీపీ కు బలంగా ఉంది. అక్కడ కూడా ఆమె తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న పలువురు వైసీపీ కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకున్నారు. ఎక్కువగా యువత పార్టీలో చేరడంతో ఆమె హర్షం వ్యక్తం చేశారు. యువతకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మాధవి రెడ్డి ఉర్దూలో అనర్గళంగా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను ఆకర్షించారు. ఏ మాత్రము తడబడకుండా సాధారణ ముస్లిం వ్యక్తి ఎలా మాట్లాడుతారో అదే తరహాలో ఆమె తన ప్రసంగాన్ని మొత్తం ఉర్దూలోనే కొనసాగించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తెలుగుదేశం ప్రభుత్వమేనని... ముస్లిం మైనారిటీలకు ప్రతి ఏడాది రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డిని, మాధవి రెడ్డిని, పలువురు టీడీపీ నాయకులను ముస్లిం సోదరులు సన్మానించారు.