Bonda Uma harsh comments on Jagan: పథకం ప్రకారమే సీఎం జగన్ అమరావతిని నాశనం చేశారు: బొండా ఉమా
🎬 Watch Now: Feature Video
TDP leader Bonda Uma harsh comments on CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఓ పథకం ప్రకారమే అమరావతిని నాశనం చేశారని బొండా ఉమా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం (మే 19, 2019) చేసిన తొలి రోజే.. అమరాతిలో జరుగుతున్న పనులను ఆపాలంటూ ఆదేశాలు ఇచ్చారని దుయ్యబట్టారు. పేద ప్రజల్ని మోసం చేయడానికే జగన్ ప్రభుత్వం.. అమరావతి ఆర్-5 జోన్‌లో సీఆర్‌డీఏ చట్టానికి వ్యతిరేకంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిందని ఆరోపించారు.
అమరావతి పట్టాలు బోగస్.. అమరావతి ఆర్-5 జోన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలపై బొండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ..''విధ్వంసంతోనే జగన్ మోహన్ రెడ్డి పరిపాలన మొదలైంది. పేద ప్రజల్ని మోసం చేయటానికే అమరావతి ఆర్-5 జోన్‌లో సీఆర్‌డీఏ చట్టానికి వ్యతిరేకంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడి ఆలోచనలతో ఆనాడూ రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని రాజధానికి భూములను కేటాయించాం. ఆ భూముల విషయంలో హైకోర్టు పలుమార్లు స్పష్టంగా చెప్పినా.. ఈ జగన్ రెడ్డి కావాలనే ఆర్భాటంగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. సెంటు భూ పంపిణీ పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7 వేల కోట్ల అవినీతికి పాల్పడింది. అమరావతి పట్టాలు బోగస్.. ఇది ముమ్మాటికి జగన్ రెడ్డి ఆడిన ఓ డ్రామా. యాభై వేల పట్టాలు ఇచ్చి.. లక్షలలో లబ్ధిదారులు లబ్ధిపొందారంటూ జగన్ రెడ్డి ప్రజల్ని దారుణంగా మోసం చేశారు. ఏడు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్‌లో ప్రయాణించిన ఈ సీఎం జగన్ రెడ్డి పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్‌లో నమోదు చేయాలని మేం రికమండ్ చేస్తాం.'' అని ఆయన వ్యాఖ్యానించారు.