TDP on I-PAC వ్యతిరేకంగా ఉన్న ప్రజల ఓట్లను తొలగించేందుకే.. వ్యక్తిగత సమాచారం ఐప్యాక్​కు చేరవేస్తున్నారు: టీడీపీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 15, 2023, 7:41 AM IST

TDP Anam AP People data రాష్ట్రంలో నాలుగేళ్లుగా వాలంటీర్ల ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారం.. వైసీపీకు రాజకీయ సలహాలందించే ఐప్యాక్‌ గుప్పిట్లోకి చేరిందని, టీడీపీ ఆరోపించింది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమచారం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐప్యాక్​తో పాటు మరో 4 ప్రైవేటు సంస్థల వద్ద ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ డేటాకు ఐ-ప్యాక్‌తో సంబంధం ఏంటని నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు ఆనం వెంకట రమణారెడ్డి, విజయ్‌కుమార్‌.. ప్రశ్నించారు. ఆ కంపెనీలన్నీ నెట్​వర్క్​గా ఏర్పడి వైసీపీ కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ప్రజల ఓట్లను ఆ డేటా ఆధారంగానే.. తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ ధైర్యంతోనే సీఎం జగన్.. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 సీట్స్ అని అంటున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. వాలంటీర్లంతా ప్రైవేటు సంస్థల నియంత్రణలో పనిచేస్తూ సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వైసీపీ కార్యకర్తలైన గృహసారథులకు రిపోర్ట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. గృహసారథుల ద్వారా ఆ డేటా ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ(ఎఫ్​ఓఏ)లకు వెళ్తోందని తెలుగు దేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.