ఏపీలో ఎన్నికల సంఘం ఆదేశాలు అమలు కావడం లేదు - ఓటర్ల జాబితాలో అక్రమాలు : ఎంపీ గల్లా జయదేవ్‌ - అక్రమ ఓట్ల తొలగింపు పై ఎంపీ గల్లా జయదేవ్‌

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 4:40 PM IST

TDP MP Spoke About Ap Voter list In Parliament : ఆంధ్రప్రదేశ్‌లో అడ్డగోలుగా ఓట్ల తొలగింపు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ కోరారు. తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్ల తొలగిస్తూ, వైఎస్సార్​సీపీ అనుకూలంగా ఉన్నవారి పేరిట దొంగ ఓట్లు చేర్చడాన్ని అడ్డుకోవాలని విన్నవించారు. పొరుగు రాష్ట్రాల అధికారులను పరిశీలకులుగా నియమించి ఓటర్ల జాబితాను సరిదిద్దాలని కోరారు. లేకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని లోక్‌సభలో ప్రస్తావించారు.  

TDP MP Galla Jayadev Speech in Lok Sabha : ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్ల వ్యవహారంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ (Galla Jayadev) పార్లమెంట్‌లో గళం విప్పారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధివిధానాల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఏపీలో ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం ఈసీ బాధ్యత అని పేర్కొన్నారు. కానీ, రాష్ట్రంలో ఆ విధమైన పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించే విషయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలను డీఆర్‌వోలు, స్థానిక సిబ్బంది ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి జాబితాలో మార్పులు చేస్తున్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.