పోరాడాల్సింది తెలంగాణ ప్రభుత్వంతో కాదు కేంద్రంతో: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 1:52 PM IST
|Updated : Dec 4, 2023, 3:07 PM IST
TDP MLC Bhumireddy Comments On YCP Government : సాగునీటి కోటా విషయంలో వైసీపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. సాగర్ ప్రాజెక్టు అంశంలో దూకుడుగా వ్యవహరించిన జగన్‌కు శ్రీశైలంలో వాటాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జల వాటాలపై కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు.
TDP MLC Bhumireddy on Krisha Water dispute : టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాడాల్సింది తెలంగాణా ప్రభుత్వంతో కాదు, కేంద్ర ప్రభుత్వంతో అని జగన్‌కు గుర్తు చేస్తున్నానని అన్నారు. నాలుగున్నరేళ్లుగా తెలంగాణ కృష్ణా జలాలను ఉపయోగించుకుంటున్నప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం యథేచ్ఛగా అక్రమ ప్రాజెక్టులు నిర్మించుకున్నప్పటికీ ఇప్పటి వరకూ నోరు మెదపలేదని రామగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. ఇటీవలే తాను నిద్రలేచినట్టు, నాగార్జున సాగర్ కుడి కాలువ గేటు ఎత్తుతామన్నారన్నారు. తెలంగాణ ఎన్నికల వేళ సీఎం జగన్ ఎందుకు రాష్ట్రంలో హడావిడి సృష్టిస్తున్నారని భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు.