TDP MLC Ashok Comments on Jagan: 'కట్టుకథలతో జరిగిన ఏపీఎన్జీవో మహాసభ.. చరిత్రలో బ్లాక్ డేగా మిగులుతుంది' - TDP MLC Ashok comments on Employees union leaders
🎬 Watch Now: Feature Video
TDP MLC Paruchuri Ashok Comments on Jagan: ఏపీఎన్జీవో మహాసభల్లో ముఖ్యమంత్రి ప్రసంగం మొత్తం అబద్ధాలు, దుష్ప్రచారమేనని తెలుగుదేశం ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు.. వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్న చెల్లింపులపై వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతినెలా ఠంచన్‌గా ఒకటో తేదీన రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చినట్టు జగన్ నిరూపించగలడా అని నిలదీశారు. జగన్ భజన తప్ప ఉద్యోగ సఘం నేతలకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్టడం లేదని విమర్శించారు. నష్టపోయిన ఉపాధ్యాయులు, జగన్‌ను నమ్మి మోసపోయిన ఆర్టీసీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు ఉద్యోగ సంఘ నేతలకు ఎందుకు పట్టవని మండిపడ్డారు. మహాసభలకు 20 వేల మంది వచ్చారంటున్న బండి శ్రీనివాసరావు.. ఎన్జీవో సభ్యత్వంతో ఉన్న వారి వివరాలు బయటపెట్టగలడా అని ప్రశ్నించారు. జీపీఎస్‌ను స్వాగతిస్తున్నామన్న శ్రీనివాసరావు వ్యాఖ్యలు ఆత్మహత్యతో సమానమన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై మాట్లాడకుండా, చీఫ్ సెక్రటరీకి చెప్పండని తప్పించుకోవడం జగన్ రెడ్డికే చెల్లిందని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి అసత్యాలు, కట్టుకథలతో ఈ రోజు జరిగిన ఏపీఎన్జీవో మహాసభ చరిత్రలో బ్లాక్ డేగా మిగులుతుందన్నారు.