జగన్ రెడ్డి అవకాశవాది - పచ్చి అబద్దాలు చెప్పడం ఆయనకే చెల్లింది: టీడీపీ మైనార్టీ సెల్ - TDP Minority Leaders
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 5:10 PM IST
TDP Minority Leaders Fires On CM Jagan: ముస్లింల ద్రోహి.. ముస్లింల వ్యతిరేకి జగన్ రెడ్డి మాయమాటల్ని ముస్లింలు ఎప్పటికీ నమ్మరని టీడీపీ మైనారిటీ సెల్ నేతలు తెలిపారు. మైనారిటీల సంక్షేమాన్ని జగన్ రెడ్డి పక్కన పెట్టారని.. మైనారిటీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ మండిపడ్డారు. మైనారిటీల ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యి.. ముస్లింలకు వ్యతిరేకంగా జేపీ తీసుకొచ్చిన సీఏఏ. ఎన్ఆర్సీ వంటి అన్ని బిల్లులు, చట్టాలకు మద్ధతు తెలిపిన అవకాశవాది జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. మైనారిటీల సంక్షేమానికి వెచ్చించాల్సిన 5,400 కోట్ల రూపాయలను దిగమింగిన పెద్ద గజదొంగ జగన్ రెడ్డి అని మండిపడ్డారు. ముస్లింలు విద్యతోనే వృద్ధిలోకి వస్తారని నమ్మిన మహానీయుడు అబుల్ కలామ్ ఆజాద్.. ఆయన జయంతి రోజున పచ్చి అబద్ధాలు చెప్పడం జగన్‌కే చెల్లిందని విమర్శించారు. అబ్దుల్ సత్తార్.. అబ్దుల్ సలాం కుటుంబాలకు జరిగిన అన్యాయంపై.. జగన్ ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. వక్ఫ్ భూములు, ఆస్తులు కొట్టేస్తున్న వైసీపీ నేతలపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీశారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం.. ముస్లిం మైనారిటీలకు అభివృద్ధి, సంక్షేమం, రక్షణ అందడం ఖాయమని స్పష్టం చేశారు.