TDP Leader on Manifesto అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు.. మేనిఫెస్టోలో రైతులు,మహిళలు,యువతకు ప్రాధాన్యం: యనమల - food in mahanadu
🎬 Watch Now: Feature Video
TDP Manifesto: ఈ నెలలో జరిగబోయే మహానాడులో మొత్తం 19 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు. గత నాలుగేళ్లుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు మహానాడులో చర్చించనున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీ, టీడీపీకి మధ్య తేడాను మహానాడు ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని యనమల వెల్లడించారు. 2024 మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది మహానాడులో తెలియజేస్తామని పేర్కొన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, యువతకే అధిక ప్రాధాన్యమని వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తుందని వైసీపీ తమపై విష ప్రచారం చేస్తుందని యనమల మండిపడ్డారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. 2000 రూపాయల నోట్లో రద్దు వల్ల దేశంలో బ్లాక్ మనీని అరికట్టగలుగుతామన్నారు. 2000 రూపాయల నోటు రద్దు పేదవాడిపై ఎటువంటి ప్రభావము ఉండదన్నా అయన 2000 రూపాయల నోటు రద్దు వల్ల అసలు ఇబ్బందులు జగన్కు వైసీపీ ఎమ్మెల్యేలకే అని ధ్వజమెత్తారు. 2000 రూపాయల నోటు రద్దు జగన్ కు చెంపపెట్టని యనమల ఎద్దేవా చేశారు.