TDP Leaders Fires on Police Cases: "యువగళం పాదయాత్రలో ఉన్నవారిపై.. అంగళ్లు ఘటనలో రాళ్లు వేశారని కేసా" - పోలీసుల అక్రమ కేసులు
🎬 Watch Now: Feature Video

TDP Leaders Fires on Angallu Punganur Police Cases: అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో తెలుగుదేశం శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస విచారణ చేపట్టకుండా.. ఎఫ్ఐర్లో పేర్లు చేర్చడం పట్ల పార్టీ నేతలు మండిపడుతున్నారు. అమెరికాలో ఉన్న వ్యక్తి పేరును పుంగనూరు కేసులో పెట్టిన పోలీసులు.. ఇప్పుడు యువగళం పాదయాత్రలో ఉన్నవారిపై అంగళ్లు ఘటనలో కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ప్రారంభం నుంచి ఫుడ్ కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్న అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్య ప్రకాశ్‌పై పోలీసులు.. అంగళ్లులో జరిగిన అల్లర్లలో కేసు నమోదు చేశారన్నారు. అసలు ఘటన సమయంలో అక్కడ లేని వ్యక్తిపై ఎలా కేసు పెడతారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. యువగళం పాదయాత్రలో ఉన్న సూర్య ప్రకాశ్.. అంగళ్లు వెళ్లి రాళ్లు వేశారని కేసు పెట్టడం పోలీసుల స్వామి భక్తికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఇలాంటి అక్రమ కేసులతో.. ప్రజలలో పోలీసు వ్యవస్థపై నమ్మకం పోతుందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.