TDP Leader Pattabhi on Fibernet Scam: ఫైబర్ నెట్ కుట్రపూరిత కేసులో మొదటి ముద్దాయి జగనే: పట్టాభి
🎬 Watch Now: Feature Video
TDP Leader Pattabhi on Fibernet Scam: ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిదంటూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తోన్న ప్రచారంపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని నిరూపించడం కోసం సీఎం జగన్ తన హోదా పరిధి దాటి కుట్రలు అమలు చేశాడని ఆరోపించారు. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌పై బురద జల్లడం కోసం లేని అవినీతిని సృష్టించి, దానిలో చంద్రబాబుని ఇరికించడం కోసం 524 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను కట్ చేయంచారని ఆగ్రహించారు. ఈ కుట్రపూరిత కేసులో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి జగనేనని పట్టాభి వ్యాఖ్యానించారు.
Pattabhi Power Point Presentation: ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పార్టీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''పరికరాలను టెరా సాఫ్ట్ సప్లయ్ చేసినట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. పరికరాలన్నీ బాగా పని చేసినట్లు సిగ్నమ్ కంపెనీ సర్టిఫికెట్ ఇచ్చింది. ఎక్స్‌పీరియన్ సర్టిఫికెట్‌ను టెరాసాఫ్ట్‌కు సిగ్నమ్ కంపెనీ ఇచ్చింది. ఈ సర్టిఫికెట్‌ను టెండర్ల సందర్భంగా టెరాసాఫ్ట్ సబ్‌మిట్ చేసి దక్కించుకుంది. దొంగ సర్టిఫికెట్లతో గౌరీ శంకర్‌ను ఏపీ ఫైబర్ నెట్‌కు ఈడీగా నియమించారు. గౌరీ శంకర్‌ను నియమించడంపై అర్హత ఉన్న మిగిలిన వారంతా ఆందోళన చేశారు. ఆందోళన తర్వాత గౌరీ శంకర్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. గౌరీ శంకర్ నియామకం సహా అతని ఎంపికలో ముఖ్యమంత్రి పాత్ర, ప్రమేయాలకు సంబంధించిన వివరాలు సీఐడీకి అందిస్తామన్నారు. తాడేపల్లి ప్యాలెస్ తలుపు తట్టే ధైర్యం సీఐడీ చీఫ్ సంజయ్‌కు ఉందా..?'' ఆయన అని ప్రశ్నించారు.