TDP on Inspector Swarnalatha ప్రభుత్వ పెద్దలే ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతను కాపాడుతున్నారు:టీడీపీ నేత నాగుల్ మీరా - ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత ఘటన
🎬 Watch Now: Feature Video
TDP Leader Nagul Meera Comments: నేరాలు చేసేవారిని గాడిలో పెట్టాల్సిన ప్రభుత్వ పెద్దలు.. నేరస్థులను కాపాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా ధ్వజమెత్తారు. నాడు పోలీసులంటే నాలుగో సింహం అన్న స్వర్ణలత బండారం నేడు బయటపడిందని ఆక్షేపించారు. విశాఖ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత వ్యవహారంతో పోలీసు కమిషనర్ రంగంలోకి దిగేంతవరకు తెలియలేదని మండిపడ్డారు. స్వర్ణలత వ్యవహారం పోలీసు వ్యవస్థ తలదించుకునేలా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. డీలింగ్కు పిలిచి సినిమా ఫక్కీలో డబ్బులు దోచుకోవడం విచిత్రమన్నారు. జగన్ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ఆక్షేపించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని విమర్శించారు. నాయకుల మాట వినకుంటే పై అధికారులతో ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారో అని పోలీసులు భయపడుతున్నారని.. ఇలాంటి ప్రభుత్వం ఇక మనుగడ సాగించడం కష్టమని తేల్చి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ రావలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.