రాష్ట్రంలో బీహార్ సంస్కృతి - పాలకుల అసమర్థత ఫలితంగా హత్యలు, దోపిడీలకు అడ్డాగా మారిన ఏపీ : జవహర్ - KS Jawahar comments on Taneti Vanitha
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 30, 2023, 11:44 AM IST
TDP Leader KS Jawahar Fires on Taneti Vanitha : రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అసమర్ధత, అధికార ధన దాహం ఫలితంగా పచ్చని ప్రాంతాన్ని హత్యలు, దోపిడీలకు అడ్డాగా మార్చారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక దోపిడీ పరాకాష్టకు చేరి.. అమాయక ప్రజల ప్రాణాలు బలికొనే స్థాయికి చేరిందని జవహర్ దుయ్యబట్టారు. తానేటి వనిత రాబోయే ఎన్నికల్లో ఖర్చుకు కావలసిన ధనాన్ని ఇప్పటి నుంచే సంపాదించే ప్రయత్నంలో ఉన్నారని, సీఎం జగన్ లక్షల కోట్లు అవినీతికి పాల్పడుతుంటే మంత్రులు వేల కోట్లకు, వారి కింద నాయకులు వందల కోట్లను అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
KS Jawahar Allegations on YSRCP Leaders Sand Mining : మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు సమీపాన గోపాలపురం నియోజకవర్గంలో నల్లజర్ల అనంతపల్లి సబ్‌రిజిస్టార్ కార్యాలయంలోప్రైవేటు లేఖరిగా పని చేస్తున్న ప్రభాకర్ హత్య బీహార్ సంస్కృతిని తలపిస్తుందని అన్నారు. హత్య జరిగి గంటల సమయం గడిచినా కనీసం సీసీ కెమెరాలు పని చేస్తున్నయో లేదో తెలుసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వ ఉండడం.. ప్రజల దురదృష్టకరమని ఆయన అన్నారు. వైసీపీ అధికారంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.