"పిన్నెల్లి బ్రదర్స్​ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారు - అక్రమ కేసులతో ప్రజలను కలవనివ్వడం లేదు"

🎬 Watch Now: Feature Video

thumbnail

TDP Leader Julakanti Brahma Reddy On Pinnelli Brothers: అక్రమ కేసులతో వైసీపీ తమను భయపెట్టలేదని టీడీపీ నేత హెచ్చరించారు. అక్రమకేసులను బనాయిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పోలీసులు నిబంధనలు విధించి ప్రజలను కలవకుండా చేస్తున్నారని టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇంచార్జ్​ ఆరోపించారు. 

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అరాచకపాలన కొనసాగుతోందని, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్​ జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. అక్రమ కేసులతో తనను భయపెట్ట లేరని బ్రహ్మారెడ్డి హెచ్చరించారు. గురువారం కంభంపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి తనే కారణమని మాచర్ల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఆటోలో ఉన్న ప్రయాణికులను కులం పేరుతో దూషించినట్లు, తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పేరిట ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారని బ్రహ్మారెడ్డి మండిపడ్డారు. నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ ఎమ్యెల్యే పిన్నెల్లి సోదరులు కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని ఎద్దేవా చేశారు. గతేడాది ఇలాగే హత్యాయత్నం కేసు మోపి నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలను కలవకుండా చేశారని పేర్కొన్నారు. వైసీపీ గుండాలు పాత్రికేయులపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

Last Updated : Dec 23, 2023, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.