ETV Bharat / state

మిస్సింగ్ మహిళల ఆచూకీ గుర్తించిన పోలీసులు - అభినందించిన పవన్ కల్యాణ్ - PAWAN KALYAN CONGRATULATES POLICE

అదృశ్యమైన 18 మంది మహిళల ఆచూకీ కనుగొన్న పోలీసులు - అభినందించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

pawan_kalyan_congratulates_police
pawan kalyan congratulates police (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2024, 8:24 PM IST

Deputy CM Pawan Kalyan Congratulates Vijayawada Police: మహిళల అదృశ్యంపై గత వైఎస్సార్​సీపీ ప్రభుత్వానికి, నేటి ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో అదృశ్యమైన 18 మంది మహిళలు, బాలికల ఆచూకీని విజయవాడ స్పెషల్‌ ఇన్వెస్ట్‌గేషన్‌ టీమ్‌ పోలీసులు గుర్తించారు. తక్కువ సమయంలోనే మహిళల మిస్సింగ్‌ కేసులను ఛేదించినట్లు కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖర్‌ బాబు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్టు చేశారు. దీనిపై డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పందించారు. సంబంధిత వార్తను ఎక్స్​లో పోస్ట్ చేశారు.

వైఎస్సార్​సీపీ పాలనలో 30 వేల మహిళలు మంది అదృశ్యమైతే జగన్ ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్‌కి ఎన్డీఏ హామీ ఇచ్చిందని, ఆ మేరకు పోలీసులు పని చేస్తున్నారని తెలిపారు. హోంమంత్రి అనిత నేతృత్వంలోని పోలీసుల స్పందనపై తాను గర్వపడుతున్నానని తెలిపారు.

కేసులను ఛేదించిన టాస్క్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా పోస్టుల నుంచి రక్షణతో సహా మహిళల భద్రతకు సీఎం చంద్రబాబు భరోసా ఇస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మన గ్రామాలు, పట్టణాలు, నగరాలను సురక్షితంగా మార్చడానికి సహకరించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

వాటర్‌ గ్రిడ్‌ తరహాలో డంపింగ్ యార్డులు ఏర్పాటు: పవన్‌ కల్యాణ్​

అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు- మాది మెతక ప్రభుత్వం కాదు: పవన్‌ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.