ETV Bharat / state

ఏపీలో 85 వేల కోట్ల పెట్టుబడులు - 10 భారీ పరిశ్రమలకు లైన్ క్లియర్ - SIPB MEETING APPROVALS

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం - 34 వేల ఉద్యోగాలు కల్పించే 10 భారీ పరిశ్రమలకు అనుమతి, భూపంపిణీ

SIPB_Meeting_Approvals
SIPB Meeting Approvals (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2024, 8:16 PM IST

SIPB Meeting Approvals: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 85 వేల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వ ఆమోదం లభించింది. 34 వేల ఉద్యోగాలు కల్పించే 10 భారీ పరిశ్రమలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ (State Investment Promotion Board) తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, నారాయణ, వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ భేటిలో ఈ అనుమతులు, భూములు ఇచ్చేందుకు నిర్ణయించారు.

SIPB_Meeting
SIPB Meeting (ETV Bharat)

ఇవీ కంపెనీల వివరాలు: రాష్ట్రంలో గడిచిన 5 నెలల్లో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలు, ఒప్పందాలు, వాటి స్థితిగతులపై చర్చించారు. ఇందులో ఆర్సెలర్స్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ జేవీ నక్కపల్లి సమీపంలోని బంగారయ్యపేట వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ తొలిదశ నిర్మాణానికి 61 వేల 780 కోట్లు పెట్టుబడులు పెట్టి 21 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. 2029 నాటికి తొలిదశ పనులు పూర్తిచేయనుంది. ఎల్​జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ 5001 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి 1495 ఉద్యోగాలు ఇవ్వనుంది. కల్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ 1430 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 565 ఉద్యోగాలు కల్పించనుంది.

టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 76 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి 250 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ 3 వేల 798 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 200 ఉద్యోగాలు ఇవ్వనుంది. అజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ 1046 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి 2 వేల 381 ఉద్యోగాలు కల్పించనుంది. డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్​పీ 50 కోట్ల పెట్టుబడి పెట్టి 2 వేల ఉద్యోగాలు ఇవ్వనుంది.

ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 8 వేల 240 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి 4 వేల ఉద్యోగాలు సృష్టించనుంది. గ్రీన్ కో సోలార్ ఐఆర్ఈపీ ప్రైవేట్ లిమిటెడ్ 2 వేల కోట్ల పెట్టుబడి పెట్టి 1725 ఉద్యోగాలు ఇవ్వనుంది. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1662 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి 350 ఉద్యోగాలు కల్పించనుంది. ఆయా సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఎస్ఐపీబీ సమావేశం అనుమతులు మంజూరు చేసింది. యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సహకాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా ఈ ప్రోత్సహకాలు ప్రకటించారు.

రాష్ట్రంలో భారత్‌ ఫోర్జ్‌ పెట్టుబడులు - ప్రభుత్వానికి సంస్థ ప్రతిపాదన

రాష్ట్రంలో రిలయన్స్​ రూ.65 వేల కోట్ల పెట్టుబడి - సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.