TDP Leader Dhulipalla వైసీపీ నాయకులకు దోచిపెట్టేందుకే వైఎస్‌ఆర్ యంత్రసేవా పథకం: ధూళిపాళ్ల నరేంద్ర - వైఎస్సార్ యంత్ర సేవా
🎬 Watch Now: Feature Video
TDP Leader Dhulipalla on YSR Yantra Seva Scheme: వైఎస్సార్ యంత్ర సేవా పథకం.. వైసీపీ నాయకులకు దోచిపెట్టెందుకేనని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. గుంటూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు సీఎం జగన్పై మండిపడ్డారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పేరు మార్పు చేస్తూ రైతు గ్రూపుల ద్వారా యంత్రాలను అద్దె రూపంలో ఇచ్చేందుకు వైయస్సార్ యంత్ర సేవా పథకం అని ప్రవేశపెట్టారన్నారని విమర్శించారు. ఏ గ్రామంలో ఏ గ్రూపు చూసినా అందులో వైసీపీ నాయకులు, వారి బంధువులు, వాలంటీర్లు మాత్రమే ఉంటున్నారని అన్నారు. సబ్సిడీపై కొనుగోలు చేసిన యంత్రాలను ఎక్కడ రైతులకు అద్దె ప్రాతిపదికన ఇచ్చిన దాఖలాలు లేవని.. వాటిని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు.
"చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు యాంత్రీకరణ పేరు మీద రకరకాల పరికరాలు ఇచ్చేవారు. అవన్నీ కూడా ఆపేసి ఈ సీహెచ్సీ సెంటర్ల పేరు మీద తమ వాళ్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం. ఏ ఊరైనా తీసుకోండి వైసీపీ నాయకుడు లేని గ్రూపే ఉండదు"-ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ నేత