TDP Leader Atchannaidu Fire on YSRCP Social Media చంద్రబాబు అరెస్టు నిరసనలపై .. వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది: అచ్చెన్నాయుడు - ఏఫీ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2023, 11:41 AM IST
TDP Leader Atchannaidu Fire on YSRCP Social Media : రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా వేలాది మంది స్వచ్ఛందంగా పాల్గొంటున్న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. తమకు మద్దతుగా వస్తున్న ఆదరణ చూసి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఓర్వలేక తప్పుడు ప్రచారానికి తెరలేపిందని (YSRCP Social Media Issued Fake Statement Name of Atchannaidu) ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరుతో పార్టీ అనుబంధ విభాగాలను హెచ్చరిస్తూ ఒక తప్పుడు ప్రకటనను విడుదల చేసి ప్రజలను, పార్టీ కేడర్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. పార్టీ అనుబంధ విభాగాలు అన్నీ ప్రతి జిల్లాలో క్రియాశీలకంగా చంద్రబాబుకి మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న తప్పుడు ఎవరూ ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేసి.. టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.