"వైసీపీ సభలు, సమావేశాలకు ప్రజలను తరలించినప్పుడు నియమాలు గుర్తు రాలేదా జగనన్నా" - TDP Leader Achanta Sunitha
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 7:58 PM IST
TDP Leader Achanta Sunitha Fires on YSRCP Government: ఏం తప్పు చేశారని కుప్పంలోని అంగన్వాడీలకు ప్రభుత్వం మెమోలు జారీ చేసి జీతాలు నిలిపివేసిందని.. టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికార సంఘాల అధ్యక్షురాలు ఆచంట సునీత ప్రశ్నించారు. వారి సమస్యలపై స్థానికి ప్రతిపక్ష నేతలను కలిసినందుకు ప్రభుత్వం వారిపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందా అని నిలదీశారు. ఇద్దరు అంగన్వాడీ సిబ్బందిని అన్యాయంగా సస్పెండ్ చేశారని.. ఇది ఎంత వరకు న్యాయమని అన్నారు. బాబుతో మేము అనే కార్యక్రమంలో పాల్గొన్నారనే నేపంతో వారిని తొలగించడం ఎంతవరకు సమంజసమన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని, వైసీపీ సభలకు ప్రజలను తరలించాలని.. అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించినప్పుడు ప్రభుత్వానికి ఈ నియమాలు గుర్తు రాలేదా అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపస్ దాటి ప్రజల్లోకి వచ్చినప్పుడే.. అంగన్వాడీ కేంద్రాల దుస్థితి, అక్కడి చిన్నారుల ఆకలి కేకలు సీఎంకు కనిపిస్తాయని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది జీతాల పెంపునకు.. ప్రతిపక్షంలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చేతులు రావడం లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ కేవలం ఉపన్యాసాలకే పరిమితం అవుతరా అని ప్రశ్నించారు.